ద్వితీయోపదేశకాండము 19:1-6
1
మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోయే దేశంలో ఉన్న జనాన్ని ముందు నాశనం చేసినప్పుడు, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుని, మీరు వారిని తరిమివేసి వారి పట్టణాల్లో వారి ఇళ్ళలో నివసించాలి.
2
మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసి ఇస్తున్న భూమిని మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత, అందులో మూడు పట్టణాలను ప్రత్యేకించాలి.
3
మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఆ పట్టణాలకు త్రోవలు ఏర్పరచాలి, ఒకడు ఎవరినైనా చంపితే అతడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయేలా ఉండాలి.
4
మునుపటి శత్రుత్వం ఏదీ లేకపోయినా ఎవరైనా అనుకోకుండ మరొకరిని చంపితే, హంతకుడు ప్రాణాలతో బ్రతకడానికి ఈ ఆశ్రయపురాల్లో దేనికైనా పారిపోవచ్చు.
5
ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు.
6
ఎక్కువ దూరమైతే, ప్రతీకారం చేయాలని వెంటాడినవాడు అతన్ని పట్టుకుని చంపుతాడేమో! అతడు ద్వేషంతో పొరుగువానిని చంపలేదు కాబట్టి, అతనికి మరణశిక్ష తగదు.
Settings