Skip to content
ద్వితీయోపదేశకాండము 19:1-13

ఆశ్రయ పట్టణాల నియమము

ద్వితీయోపదేశకాండము 19:1-13
1
మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోయే దేశంలో ఉన్న జనాన్ని ముందు నాశనం చేసినప్పుడు, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుని, మీరు వారిని తరిమివేసి వారి పట్టణాల్లో వారి ఇళ్ళలో నివసించాలి.
2
మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసి ఇస్తున్న భూమిని మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత, అందులో మూడు పట్టణాలను ప్రత్యేకించాలి.
3
మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఆ పట్టణాలకు త్రోవలు ఏర్పరచాలి, ఒకడు ఎవరినైనా చంపితే అతడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయేలా ఉండాలి.
4
మునుపటి శత్రుత్వం ఏదీ లేకపోయినా ఎవరైనా అనుకోకుండ మరొకరిని చంపితే, హంతకుడు ప్రాణాలతో బ్రతకడానికి ఈ ఆశ్రయపురాల్లో దేనికైనా పారిపోవచ్చు.
5
ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు.
6
ఎక్కువ దూరమైతే, ప్రతీకారం చేయాలని వెంటాడినవాడు అతన్ని పట్టుకుని చంపుతాడేమో! అతడు ద్వేషంతో పొరుగువానిని చంపలేదు కాబట్టి, అతనికి మరణశిక్ష తగదు.
7
అందువల్లనే మూడు పట్టణాలను మీరు ఎంచుకోవాలని ఆజ్ఞాపించాను.
8
మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు మీ దేవుడైన యెహోవా మీ సరిహద్దులను విశాలపరచి వారికి వాగ్దానం చేసిన దేశమంతటిని మీకు ఇస్తే,
9
నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ చట్టాలన్నిటిని మీరు జాగ్రత్తగా అనుసరించి అనగా మీ దేవుడనైన యెహోవాను ప్రేమిస్తూ, నిత్యం ఆయన పట్ల విధేయత కలిగి మీరు నడుస్తూ, మరో మూడు పట్టణాలు ప్రత్యేకించాల్సి ఉంటుంది.
10
మీ దేవుడైన యెహోవా నీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషి రక్తం చిందించబడకుండ, మీరు రక్తపాతానికి పాల్పడకుండ ఉండడానికి ఇలా చేయండి.
11
కాని ఎవరైనా ద్వేషంతో ఎవరి కొరకైనా పొంచి ఉండి, అతని మీద పడి చంపితే అతడా పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయినా ఊరి పెద్దలు అతన్ని బయటకు రప్పించాలి.
12
హంతకుని పట్టణ పెద్దలు పిలిపించి, ప్రతీకారం చేయడానికి వచ్చిన వానికి అతన్ని అప్పగించాలి.
13
జాలి చూపవద్దు. నిర్దోషి రక్తాన్ని చిందించిన అపరాధాన్ని మీరు ఇశ్రాయేలు నుండి ప్రక్షాళన చేయాలి, తద్వారా మీరు బాగుంటారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options