- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించుట
దానియేలు 1:1-7
1
యూదా రాజైన యెహోయాకీము పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దానిని ముట్టడించాడు.
2
ప్రభువు నెబుకద్నెజరు చేతికి యూదా రాజైన యెహోయాకీమును, దేవుని ఆలయపు పరికరాలతో పాటు అప్పగించారు. బబులోను రాజు వాటిని తన బబులోనియా దేవుని గుడికి తీసుకెళ్లి వాటిని తన దేవుని ధనాగారంలో ఉంచాడు.
3
రాజు, రాజ్య పరిచర్య చేయడానికి ఇశ్రాయేలీయులలో రాజకుటుంబానికి, రాజవంశాలకు చెందిన కొంతమందిని తీసుకురమ్మని తన ముఖ్య అధికారియైన అష్పెనజును ఆదేశించాడు.
4
ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల భాష చదవడం వ్రాయడం నేర్పాలి.
5
రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి.
6
యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు.
7
ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు.
Settings