ఆమోసు 6:8-14
8
ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను అతని కోటలను ద్వేషిస్తున్నాను; నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో శత్రువు వశం చేస్తాను.”
9
ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా,
10
ఆ శవాలను ఇంట్లోనుండి తీసుకుపోయి వాటిని దహనం చేయడానికి వచ్చిన బంధువు ఇంట్లో దాక్కొని ఉన్నవానితో, “నీతో ఇంకెవరైన ఉన్నారా?” అని అడిగితే, “లేదు” అని అతడు చెప్తే, “మాట్లాడకు, మనం యెహోవా పేరును ప్రస్తావించకూడదు” అని అంటాడు.
11
ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి చిన్నా కుటుంబాలు చీలిపోతాయి.
12
గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా? బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? కాని న్యాయాన్ని విషంగా మార్చారు, నీతి ఫలాన్ని చేదుగా మార్చారు.
13
లో దెబారును జయించి ఆనందిస్తున్న మీరు, “మా సొంత బలంతోనే కర్నాయీమును పట్టుకోలేదా?” అంటారు.
14
అయితే సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు, “ఇశ్రాయేలూ, నేను నీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను, అది నిన్ను హమాతు మొదలుకొని అరాబా లోయవరకు ఆ అరణ్య మార్గమంతా నిన్ను హింసిస్తుంది.”
Settings