Skip to content
ఆమోసు 3:3-8

ఆమోసు 3:3-8

3
పరస్పర సమ్మతి లేకుండా ఇద్దరూ కలిసి నడుస్తారా?
4
ఆహారం దొరకక పోతే, సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే అది దాని గుహలో గుర్రుమంటుందా?
5
నేల మీద ఎరపెట్టనిదే, పక్షి ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే, ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా?
6
పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?
7
తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.
8
సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options