అపొస్తలుల కార్యములు 18:13
చుట్టుపక్కల సందర్భంతో వచనం 13 చూపబడుతోంది.
10
ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీ మీద దాడి చేసి నీకు హాని చేయరు, ఈ పట్టణంలో నాకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు” అని చెప్పారు.
11
కాబట్టి ఒకటిన్నర సంవత్సరం పాటు పౌలు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు.
12
అకాయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు.
13
వారు అతని మీద, “ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పద్ధతులతో దేవుని ఆరాధించండని ప్రజలను ఒప్పిస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు.
14
పౌలు మాట్లాడడం ఆరంభిస్తుండగా, గల్లియో వారితో, “యూదులారా, మీరు ఒక అన్యాయం లేదా నేరానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే, నేను మీ మాటలు వినడం న్యాయంగా ఉంటుంది.
15
కాని ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, మాటలు, పేర్ల గురించే కాబట్టి మీరే పరిష్కరించుకోండి. అలాంటి విషయాలకు నేను న్యాయాధికారిని కాను” అని వారితో చెప్పి,
16
వారందరిని అక్కడినుండి పంపేశాడు.
Settings