Skip to content
2 సమూయేలు 4:1-4

సౌలు వంశ పతనం

2 సమూయేలు 4:1-4
1
సౌలు కుమారుడైన ఇష్-బోషెతుకు హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని తెలిసినప్పుడు అతడు భయపడ్డాడు. ఇశ్రాయేలీయులందరు ఆందోళన చెందారు.
2
సౌలు కుమారునికి ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు; ఒకని పేరు బయనా రెండవ వాని పేరు రేకాబు; వారు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశానికి చెందిన భూభాగము.
3
అయితే బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి విదేశీయులుగా నేటి వరకు అక్కడే స్థిరపడి ఉన్నారు.
4
(సౌలు కుమారుడైన యోనాతానుకు రెండు కాళ్లు కుంటివైన ఒక కుమారుడు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వార్త వచ్చినప్పుడు వానికి అయిదు సంవత్సరాలు. అతని ఆయా వానిని తీసుకుని పారిపోయే తొందరలో ఉన్నప్పుడు అతడు క్రిందపడి కుంటివాడయ్యాడు. వాని పేరు మెఫీబోషెతు.)
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options