Skip to content
2 సమూయేలు 3:19-28

2 సమూయేలు 3:19-28

19
అలాగే అబ్నేరు బెన్యామీనీయులతో స్వయంగా మాట్లాడాడు. ఆ తర్వాత అతడు హెబ్రోనుకు వెళ్లి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు అనుకున్న దాన్నంతా దావీదుకు తెలియజేశాడు.
20
అబ్నేరు తనతో కూడా ఇరవైమంది మనుష్యులను వెంటపెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి అతనితో ఉన్నవారందరికి దావీదు గొప్ప విందు ఏర్పాటు చేశాడు.
21
అప్పుడు అబ్నేరు దావీదుతో, “నేను వెంటనే వెళ్లి ఇశ్రాయేలీయులందరిని నా ప్రభువైన రాజు కోసం సమావేశపరచి, వారు మీతో నిబంధన చేసేలా మీరు కోరుకున్న విధంగా మీరు వారిని పరిపాలించేలా చేస్తాను” అని చెప్పాడు. కాబట్టి దావీదు అబ్నేరును పంపించగా, అతడు సమాధానంతో వెళ్లాడు.
22
దాని తర్వాత దావీదు మనుష్యులు, యోవాబు తిరిగివస్తూ తమతో పాటు పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును తీసుకువచ్చారు. కాని వారు వచ్చేసరికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఎందుకంటే దావీదు అతన్ని పంపివేశాడు, అతడు సమాధానంతో వెళ్లిపోయాడు.
23
యోవాబు అతనితో ఉన్న సైనికులందరూ వచ్చినప్పుడు నేరు కుమారుడైన అబ్నేరు రాజు దగ్గరకు వచ్చాడని, రాజు అతన్ని పంపివేయగా అతడు సమాధానంతో వెళ్లిపోయాడని యోవాబుకు తెలిసింది.
24
కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి, “నీవు ఏమి చేశావు? అబ్నేరు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని ఎందుకు వెళ్లనిచ్చావు? ఇప్పుడు అతడు వెళ్లిపోయాడు!
25
నేరు కుమారుడైన అబ్నేరు ఎలాంటివాడో నీకు తెలుసు. నిన్ను మోసం చేయడానికి నీ కదలికలు గమనించడానికి నీవు ఏం చేస్తున్నావో తెలుసుకోవడానికే అతడు వచ్చాడు” అన్నాడు.
26
యోవాబు దావీదు దగ్గర నుండి వెళ్లి అబ్నేరును వెనుకకు పిలుచుకురమ్మని దూతలను పంపాడు. వారు వెళ్లి అతన్ని సిరా అనే బావి దగ్గరకు తీసుకువచ్చారు. అయితే ఇదంతా దావీదుకు తెలియదు.
27
అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు.
28
తర్వాత ఈ సంగతి తెలిసిన దావీదు, “నేరు కుమారుడైన అబ్నేరు రక్తం విషయంలో నేను నా రాజ్యం ఎప్పటికీ యెహోవా దృష్టిలో నిర్దోషులమే.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options