Skip to content
2 సమూయేలు 16:15-19

అబ్షాలోము యెరూషలేములో ప్రవేశించుట; హూషై పన్నాగం

2 సమూయేలు 16:15-19
15
ఇంతలో అబ్షాలోము ఇశ్రాయేలు వారందరు యెరూషలేముకు వచ్చారు. అహీతోపెలు కూడా అతనితో ఉన్నాడు.
16
అప్పుడు దావీదు స్నేహితుడు అర్కీయుడైన హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చి అతనితో, “రాజు చిరకాలం జీవించు గాక! రాజు చిరకాలం జీవించు గాక!” అన్నాడు.
17
అబ్షాలోము, “నీ స్నేహితుడైన దావీదుకు నీవు చూపించే ప్రేమ ఇదేనా? అతడు నీ స్నేహితుడే కదా, అతనితో పాటు నీవెందుకు వెళ్లలేదు?” అని హూషైను అడిగాడు.
18
అందుకు హూషై అబ్షాలోముతో, “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులందరు కలిసి ఎవరిని ఎంచుకుంటారో అతనికి చెందిన వాడనై అతనితోనే నేను ఉంటాను.
19
అంతేకాదు నేను ఎవరికి సేవ చేయాలి? అతని కుమారునికి నేను సేవ చేయకూడదా? మీ తండ్రికి సేవ చేసినట్లే నీకు కూడా నేను సేవ చేస్తాను” అన్నాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options