Skip to content
2 రాజులు 6:1-7

2 రాజులు 6:1-7

1
ప్రవక్తల బృందం వారు ఎలీషాతో, “చూడండి, మిమ్మల్ని కలుసుకునే ఈ స్థలం ఇరుకుగా ఉంది.
2
మీరు ఒప్పుకుంటే మేము యొర్దానుకు వెళ్లి తలా ఒక దూలం తీసుకువచ్చి మనం కలుసుకోవడానికి ఒక స్థలాన్ని కడతాం” అన్నారు. ఎలీషా, “వెళ్లండి” అన్నాడు.
3
అప్పుడు వారిలో ఒకడు, “దయచేసి మీ దాసులైన మాతో కూడా రండి” అన్నాడు. ఎలీషా, “నేను వస్తాను” అన్నాడు.
4
కాబట్టి అతడు వారితో వెళ్లాడు. వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు.
5
వారిలో ఒకడు చెట్టు నరుకుతుండగా గొడ్డలి ఊడి నీళ్లలో పడింది. అతడు, “అయ్యో, నా ప్రభువా! అది అద్దెకు తెచ్చుకున్నది!” అని కేక పెట్టాడు.
6
దైవజనుడు, “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అది పడ్డ స్థలం అతడు చూపించగా ఎలీషా ఒక కర్రను నరికి అక్కడ విసరగా ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది.
7
అప్పుడతడు, “దాన్ని బయటకు తీయి” అన్నాడు. అతడు చేయి చాపి దాన్ని తీసుకున్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options