Skip to content
2 రాజులు 4:8-16

2 రాజులు 4:8-16

8
ఒక రోజు ఎలీషా షూనేముకు వెళ్లాడు. అక్కడ ఒక ధనికురాలు ఉండేది, ఆమె భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడింది. కాబట్టి అతడు ఆ దారిన వెళ్లేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఆగేవాడు.
9
ఆమె తన భర్తతో, “మన దారిలో వస్తూ వెళ్తూ ఉండే ఈ మనిషి పరిశుద్ధుడైన దైవజనుడని నాకు తెలుసు.
10
మనం పైకప్పు మీద చిన్న గది కట్టి అందులో పడక, బల్ల, కుర్చీ, దీపం ఉంచుదాము. మన దగ్గరకు అతడు వచ్చినప్పుడెల్లా, అతడు ఆ గదిలో ఉండవచ్చు” అని చెప్పింది.
11
ఒక రోజు ఎలీషా అక్కడికి వచ్చి ఆ మేడ గదిలో పడుకున్నాడు.
12
తర్వాత అతడు తన సేవకుడైన గేహజీతో, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగానే ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.
13
ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు. అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను” అన్నది.
14
ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు. గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.
15
అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.
16
అప్పుడు ఎలీషా, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు” అని చెప్పాడు. అందుకామె, “వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!” అని అన్నది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options