కంటెంట్‌కు వెళ్లండి
2 రాజులు 17:1-6

సమరియా పతనం మరియు ఇశ్రాయేలు అంతము

2 రాజులు 17:1-6
1
యూదా రాజైన ఆహాజు పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు.
2
అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అయితే తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల మాదిరిగా కాదు.
3
అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేయడానికి రాగా హోషేయ అతనికి లొంగిపోయి అతనికి పన్ను చెల్లించాడు.
4
అయితే హోషేయ కుట్ర చేస్తున్నట్టు అష్షూరు రాజు పసిగట్టాడు, ఎందుకంటే హోషేయ, ఈజిప్టు రాజైన సో దగ్గరకు దూతలను పంపి ప్రతి సంవత్సరం అష్షూరు రాజుకు చెల్లించే పన్ను చెల్లించడం మానేశాడు; కాబట్టి షల్మనేసెరు అతన్ని పట్టుకుని చెరసాలలో వేశాడు.
5
అప్పుడు అష్షూరు రాజు దేశానంతా ఆక్రమించి, సమరయ మీదికి దండెత్తి దాన్ని మూడేళ్ళ వరకు ముట్టడించాడు.
6
హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options