Skip to content
2 దినవృత్తాంతములు 34:3-8

2 దినవృత్తాంతములు 34:3-8

3
అతడు పాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా యువకునిగా ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని వెదకడం మొదలుపెట్టాడు. పన్నెండవ సంవత్సరంలో ఉన్నత స్థలాలను అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను తీసివేయడం, యూదాను యెరూషలేమును పవిత్రం చేయడం మొదలుపెట్టాడు.
4
అతని ఆదేశాల మేరకు ప్రజలు బయలు బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను సూర్యదేవతా విగ్రహాలను అతడు కూలగొట్టించాడు. అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులర్పించినవారి సమాధుల మీద చల్లివేశాడు.
5
ఆ దేవత పూజారుల ఎముకలను వారి బలిపీఠాల మీద కాల్పించాడు. ఈ విధంగా అతడు యూదాను, యెరూషలేమును పవిత్రం చేశాడు.
6
మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో,
7
అతడు బలిపీఠాలను అషేరా స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలను దేవతాస్తంభాలను ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలు దేశమంతట్లో ధూపవేదికలన్నిటినీ సూర్య దేవత విగ్రహాలన్నిటిని ముక్కలుగా నరికి వేయించాడు. ఆ తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
8
యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో దేశాన్ని, మందిరాన్ని పవిత్రం చేద్దామని తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణ అధిపతియైన మయశేయా, లేఖికుడును యోవాహాజు కుమారుడునైన యోవాహును పంపాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options