2 దినవృత్తాంతములు 31:16-21
16
అంతేకాక, మూడేళ్ళు, ఆపైన వయస్సుండి, వంశావళిలో నమోదైన మగపిల్లలకు కూడా వారు పంచిపెట్టారు. వారి వారి వరుస ప్రకారం, బాధ్యత ప్రకారం సేవ చేయడానికి ప్రతిరోజు యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ కూడా వారి భాగాలు పంచిపెట్టారు.
17
వారి వారి పూర్వికుల కుటుంబాల ప్రకారం వంశావళిలో నమోదైన యాజకులకు, వారి వారి పనుల ప్రకారం, వరుస ప్రకారం, ఇరవై సంవత్సరాలు, అంతకంటే పై వయస్సున్న లేవీయులకు కూడా వారు పంచిపెట్టారు.
18
వారు నమ్మకంగా తమను దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారు కాబట్టి ఆ వంశావళిలో ఉన్న వారందరి చిన్నపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెల కోసం కూడా పంచిపెట్టారు.
19
తమ పట్టణాల చుట్టుప్రక్కల భూములలో, ఇతర పట్టణాల్లో అహరోను వారసులైన యాజకులు కొందరు కాపురముండేవారు. వారిలో మగవారందరికీ వంశావళిలో నమోదైన లేవీయులందరికి వారి భాగాలను పంచడానికి పేరుపేరున మనుష్యులు నియమించాడు.
20
హిజ్కియా ఆ విధంగా యూదా అంతటా చేశాడు. యెహోవా దృష్టిలో మంచిగా, సరియైన విధంగా, నమ్మకంగా ప్రవర్తించాడు.
21
యెహోవా ఆలయ సేవ కోసం, ధర్మశాస్త్రం, ఆజ్ఞ కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలోను అతడు తన దేవుని వెదికి అనుసరించాడు. మనస్పూర్తిగా పని చేశాడు కాబట్టి వర్ధిల్లాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings