Skip to content
2 దినవృత్తాంతములు 22:6-11

2 దినవృత్తాంతములు 22:6-11

6
కాబట్టి అతడు రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా, గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.
7
అహజ్యా యోరామును దర్శించడం ద్వారా దేవుడు అహజ్యాను పతనానికి తెచ్చారు. అహజ్యా చేరుకున్నప్పుడు, అహాబు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా అభిషేకించిన నిమ్షీ కుమారుడైన యెహు మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్లాడు.
8
యెహు అహాబు ఇంటిపై తీర్పును అమలు చేస్తున్నప్పుడు, అతడు యూదా అధికారులను, అహజ్యాకు సేవ చేస్తున్న అహజ్యా బంధువుల కుమారులను చూసి వారిని చంపాడు.
9
తర్వాత అతడు అహజ్యాను వెదకడానికి వెళ్లాడు. అహజ్యా సమరయలో దాక్కుని ఉండగా యెహు మనుష్యులు అతన్ని పట్టుకున్నారు. వారు అతన్ని యెహు దగ్గరకు తీసుకువచ్చి చంపారు. వారు, “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు సంతానంలో ఒకడు” అని అంటూ అతన్ని సమాధి చేశారు. ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించే సామర్థ్యంగల వాడెవడూ అహజ్యా కుటుంబంలో మిగల్లేదు.
10
అహజ్యా తల్లి అతల్యా తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని ఆమె యూదా రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది.
11
కాని, రాజైన యెహోరాము కుమార్తెయైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును, చావవలసిన రాకుమారుల నుండి రహస్యంగా తప్పించి అతన్ని, అతని దాదిని ఒక పడకగదిలో ఉంచింది. రాజైన యెహోరాము కుమార్తె, యాజకుడైన యెహోయాదా భార్యయైన ఈ యెహోషేబ అహజ్యాకు సోదరి కాబట్టి ఆ పసివాన్ని అతల్యా నుండి దాచిపెట్టింది; కాబట్టి అతడు చంపబడలేదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options