Skip to content
1 సమూయేలు 10:18

1 సమూయేలు 10:18

చుట్టుపక్కల సందర్భంతో వచనం 18 చూపబడుతోంది.
15
అందుకు సౌలు చిన్నాన్న, “సమూయేలు నీతో ఏమి చెప్పాడో నాతో చెప్పు” అని అన్నాడు.
16
సౌలు, “గాడిదలు దొరికాయని అతడు మాకు హామీ ఇచ్చాడు” అని తన చిన్నాన్నకు చెప్పాడు. అయితే రాజ్యాధికారం గురించి సమూయేలు చెప్పిన విషయాన్ని అతడు తన మామకు చెప్పలేదు.
17
తర్వాత సమూయేలు మిస్పాలో యెహోవా దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలను పిలిపించి,
18
వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’
19
అయితే మీ కష్టాలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు తిరస్కరించారు. ‘మామీద రాజుగా ఒకరిని నియమించు’ అని ఆయనను అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల ప్రకారం మీరు యెహోవా సన్నిధికి రావాలి.”
20
సమూయేలు ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిని సమకూర్చినప్పుడు చీటిలో బెన్యామీను గోత్రం ఎంపిక చేయబడింది.
21
బెన్యామీను గోత్రం వారిని వారి కుటుంబాల ప్రకారం సమకూర్చినప్పుడు చీటిలో మత్రీ కుటుంబం ఎంపిక చేయబడింది. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఎంపిక చేయబడ్డాడు. అయితే వారు అతని కోసం వెదికినప్పుడు అతడు కనబడలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options