కంటెంట్‌కు వెళ్లండి
1 పేతురు 3:1-7

భార్యాభర్తల కర్తవ్యాలు

1 పేతురు 3:1-7
1
అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. ఒకవేళ వారిలో ఎవరైనా దేవుని వాక్యాన్ని అంగీకరించనివారు ఉంటే, మీరు ఒక్క మాట కూడా పలకాల్సిన అవసరం లేకుండానే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు.
2
ఎందుకంటే భయభక్తులతో, పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనిస్తారు.
3
తల వెంట్రుకలను అలంకరించుకోవడం, బంగారు ఆభరణాలను ధరించడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం అనే బాహ్య సౌందర్యం వద్దు.
4
మృదువైన, సాధు స్వభావమనే అక్షయమైన అలంకారం గల హృదయపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది.
5
ఎలాగంటే, పూర్వకాలంలో పరిశుద్ధులైన స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకుంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు.
6
అదే విధంగా శారా అబ్రాహాముకు లోబడి అతడిని యజమాని అని పిలిచింది. మీరు మంచి పనులు చేస్తూ దేనికి బెదరని వారైతే ఆమెకు పిల్లలవుతారు.
7
అలాగే భర్తలారా మీరు, మీ భార్యలు జీవమనే కృపావరంలో మీతో జతపనివారై ఉన్నారని ఎరిగి బలహీనులైన మీ భార్యలను గౌరవిస్తూ వారితో కాపురం చేయండి. అప్పుడు మీ ప్రార్థనలకు ఆటంకం ఉండదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options