1 రాజులు 17:17-24
17
కొంతకాలం తర్వాత ఇంటి యజమానురాలి కుమారునికి జబ్బుచేసింది. ఆ జబ్బు తీవ్రమైనందుకు అతడు ప్రాణం విడిచాడు.
18
ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?”
19
ఏలీయా జవాబిస్తూ, “నీ కుమారున్ని నాకు ఇవ్వు” అన్నాడు. ఆమె చేతిలో నుండి అతన్ని తీసుకుని, తాను ఉంటున్న మేడ గదికి తీసుకెళ్లి, తన పడక మీద పడుకోబెట్టాడు.
20
తర్వాత అతడు యెహోవాకు మొరపెడుతూ అన్నాడు, “యెహోవా నా దేవా, నేను ఎవరి ఇంట్లో అతిథిగా ఉంటున్నానో ఆ విధవరాలి కుమారున్ని చనిపోయేలా చేసి, ఆమెకు కూడా విషాదాన్ని కలిగించారా?”
21
తర్వాత అతడు ఆ బాలుని మీద మూడుసార్లు చాచుకొని, “యెహోవా, నా దేవా! ఈ బాలునికి ప్రాణం తిరిగి రానివ్వండి!” అని యెహోవాకు మొరపెట్టాడు.
22
ఏలీయా చేసిన ప్రార్థన యెహోవా విన్నారు, బాలునికి ప్రాణం తిరిగి వచ్చింది, అతడు బ్రతికాడు.
23
ఏలీయా ఆ బాలున్ని ఎత్తుకుని ఆ గది నుండి క్రింద ఇంట్లోకి తీసుకువచ్చి, ఆ బాలుని తల్లి చేతికి ఇస్తూ, “చూడు, నీ కుమారుడు సజీవంగా ఉన్నాడు” అన్నాడు.
24
అప్పుడు ఆ స్త్రీ ఏలీయాతో, “ఇప్పుడు మీరు దైవజనులని, మీ నోట ఉన్న యెహోవా వాక్కు సత్యమని నాకు తెలిసింది” అన్నది.
Settings