1 రాజులు 13:33
చుట్టుపక్కల సందర్భంతో వచనం 33 చూపబడుతోంది.
30
అతడు తన సమాధిలో ఆ శవాన్ని ఉంచగా వారు, “అయ్యో, సోదరుడా!” అని అంటూ ఏడ్చారు.
31
అతన్ని పాతిపెట్టిన తర్వాత, అతడు తన కుమారులతో, “నేను చనిపోయినప్పుడు ఆ దైవజనుని పాతిపెట్టిన సమాధిలోనే నన్ను పాతిపెట్టండి; నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి.
32
ఎందుకంటే, బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ పట్టణాల్లో ఉన్న ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలన్నింటికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు ప్రకారం అతడు ప్రకటించింది తప్పక జరుగుతుంది.”
33
దీని తర్వాత కూడా యరొబాము తన దుర్మార్గాలను విడిచిపెట్టలేదు, కాని మరోసారి క్షేత్రాలకు అని రకాల ప్రజలను యాజకులుగా నియమించాడు. ఎవరైనా యాజకునిగా ఉండాలనుకుంటే వారిని ఆ క్షేత్రాలకు యాజకులుగా ప్రతిష్ఠించాడు.
34
ఈ పాపం యరొబాము కుటుంబ పతనానికి వారు భూమి మీద ఉండకుండా నాశనమవ్వడానికి కారణమైంది.
Settings