Skip to content
1 రాజులు 14:1-6

1 రాజులు 14:1-6

1
ఆ కాలంలో యరొబాము కుమారుడైన అబీయాకు జబ్బుచేసింది.
2
యరొబాము తన భార్యతో, “నీవు యరొబాము భార్యవని ఎవ్వరూ గుర్తుపట్టకుండా, మారువేషం వేసుకుని షిలోహుకు వెళ్లు. అక్కడ నేను ఈ ప్రజల మీద రాజునవుతానని నాకు చెప్పిన అహీయా ప్రవక్త ఉంటాడు.
3
పది రొట్టెలు, కొన్ని అప్పములు, జాడీలో తేనె తీసుకుని అతని దగ్గరకు వెళ్లు. బాలునికి ఏమి జరుగుతుందో అతడు నీకు చెప్తాడు” అన్నాడు.
4
యరొబాము భార్య అతడు చెప్పినట్లు చేసింది. ఆమె షిలోహులో ఉన్న అహీయా ఇంటికి వెళ్లింది. అహీయాకు వృద్ధాప్యం వలన చూపు పోయింది.
5
అయితే యెహోవా అహీయాతో, “యరొబాము కుమారునికి జబ్బుచేసింది కాబట్టి అతని భార్య తన కుమారుని గురించి సంప్రదించడానికి నీ దగ్గరకు వస్తుంది. నీవు ఆమెతో నేను చెప్పే విధంగా జవాబివ్వాలి. ఆమె మారువేషం వేసుకుని మరో స్త్రీలా నటిస్తుంది” అని చెప్పారు.
6
కాబట్టి ఆమె గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు, అహీయాకు ఆమె అడుగుల శబ్దం వినిపించి ఆమెతో ఇలా అన్నాడు, “యరొబాము భార్యా, లోపలికి రా. ఎందుకు ఈ నటన? దుర్వార్త నీకు చెప్పడానికి నేను ఆదేశించబడ్డాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options