1 రాజులు 13:1-7
1
యరొబాము బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, యెహోవా వాక్కు ద్వారా ఒక దైవజనుడు యూదా నుండి బేతేలుకు వచ్చాడు.
2
యెహోవా వాక్కు ప్రకారం అతడు బలిపీఠానికి వ్యతిరేకంగా బిగ్గరగా ఇలా అన్నాడు: “బలిపీఠమా, బలిపీఠమా! యెహోవా చెప్పే మాట ఇదే: ‘దావీదు కుటుంబంలో యోషీయా అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు క్షేత్రాల మీద బలులు అర్పించే యాజకులను నీ మీద వధిస్తాడు, మనుష్యుల ఎముకలు నీ మీద కాల్చబడతాయి.’ ”
3
అదే రోజు ఆ దైవజనుడు ఒక సూచన ఇచ్చాడు: “యెహోవా చెప్పిన సూచన ఇదే: బలిపీఠం బద్దలై దాని మీదున్న బూడిద ఒలికి పోతుంది.”
4
రాజైన యరొబాము బేతేలులో ఉన్న బలిపీఠం గురించి దైవజనుడు ప్రకటించిన మాట విని, బలిపీఠం మీద నుండి తన చేయి చాపి, “అతన్ని పట్టుకోండి!” అన్నాడు. అయితే అతడు చాపిన చేయి తిరిగి వెనుకకు తీసుకోలేకుండా అది ఎండిపోయింది.
5
అంతేకాక, యెహోవా వాక్కు ద్వారా దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారం బలిపీఠం బద్దలై దానిమీది నుండి బూడిద ఒలికిపోయింది.
6
అప్పుడు రాజు ఆ దైవజనునితో, “నా మీద దయచూపి నా చేయి బాగుపడేలా నా కోసం నీ దేవుడైన యెహోవాకు విజ్ఞాపన ప్రార్థన చేయి” అన్నాడు. దైవజనుడు యెహోవాను వేడుకున్నప్పుడు రాజు చేయి పూర్తిగా బాగుపడి ముందులా అయ్యింది.
7
అప్పుడు రాజు దైవజనునితో, “భోజనం చేయడానికి నాతో ఇంటికి రా, నీకు బహుమానం ఇస్తాను” అన్నాడు.
Settings