1 రాజులు 11:35-42
35
అతని కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి పది గోత్రాలను నీకు ఇస్తాను.
36
నా పేరు అక్కడ ఉండాలని నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణంలో నా సేవకుడైన దావీదు కోసం నా సన్నిధిలో ఒక దీపం ఎల్లప్పుడు ఉండడం కోసం నేను అతని కుమారునికి ఒక గోత్రాన్ని ఇస్తాను.
37
నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నీవు కోరుకున్న ప్రకారం నీవు పరిపాలిస్తావు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావు.
38
నేను ఆజ్ఞాపించేదంతా నీవు చేసి, నా మార్గాలను అనుసరిస్తే, నా సేవకుడైన దావీదులా నా శాసనాలు ఆజ్ఞలు పాటిస్తూ, నా దృష్టిలో సరియైనది చేస్తే నేను నీతో ఉంటాను. నేను దావీదు పట్ల చేసినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరచి నీకు ఇశ్రాయేలును ఇస్తాను.
39
వారు చేసిన దానికి నేను దావీదు సంతానాన్ని శిక్షిస్తాను కాని ఎప్పటికి కాదు.’ ”
40
సొలొమోను యరొబామును చంపే ప్రయత్నం చేశాడు కాని, యరొబాము ఈజిప్టుకు షీషకు రాజు దగ్గరకు పారిపోయి సొలొమోను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు.
41
సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన వాటన్నిటి గురించి, అతని జ్ఞానం గురించి సొలొమోను చరిత్ర గ్రంథంలో వ్రాయబడినవి.
42
సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలంతటిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings