1 దినవృత్తాంతములు 5:1-10
1
ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు.
2
యూదా తన అన్నదమ్ములకంటే బలవంతుడు, అతని వంశంలో నుండి పరిపాలకుడు వచ్చాడు, అయినా కూడా జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపుకు వచ్చాయి.)
3
ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు వీరు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
4
యోవేలు సంతానం: అతని కుమారుడు షెమయా, అతని కుమారుడు గోగు, అతని కుమారుడు షిమీ,
5
అతని కుమారుడు మీకా, అతని కుమారుడు రెవాయా, అతని కుమారుడు బయలు,
6
అతని కుమారుడు బెయేర, ఇతన్ని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు బందీగా తీసుకెళ్లాడు. బెయేర రూబేనీయులకు నాయకుడు.
7
వారి వంశావళిలో పేర్కొన్న కుటుంబాల ప్రకారం వారి బంధువులు: నాయకుడైన యెహీయేలు, జెకర్యా,
8
యోవేలు కుమారుడైన షెమ కుమారుడైన ఆజాజు కుమారుడైన బేల. వారు అరోయేరు నుండి నెబో వరకు, బయల్-మెయోను వరకు నివసించారు.
9
వారి పశువులు గిలాదులో విస్తారంగా వృద్ధిచెందడంతో, తూర్పున యూఫ్రటీసు నది దగ్గర నుండి ఎడారి సరిహద్దు వరకు వారు నివసించారు.
10
సౌలు పాలిస్తున్నప్పుడు వారు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. వారు గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయీల నివాస స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.
Settings