Skip to content

కీర్తనలు98

1
ఒక కీర్తన. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.
2
యెహోవా రక్షణను వెల్లడించారు. దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.
3
ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.
4
భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి;
5
వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో,
6
బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.
7
సముద్రం, అందులో ఉన్నదంతా, లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక.
8
యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి.
9
యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options