కంటెంట్‌కు వెళ్లండి

కీర్తనలు20

రాజు విమోచన కొరకు ప్రార్థన

1
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.
2
తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి, సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి.
3
మీ అర్పణలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మీ దహనబలులను అంగీకరించాలి. సెలా
4
ఆయన మీ హృదయ వాంఛను తీర్చాలి, మీ ప్రణాళికలన్నిటిని సఫలం చేయాలి.
5
యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి.

దైవిక నమ్మక ప్రకటన

6
యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.

యెహోవా నామముపై నమ్మకముంచుట

7
కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు, కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము.
8
వారు పూర్తిగా పతనం చేయబడ్డారు, కాని మేము లేచి స్థిరంగా నిలబడతాము.

రాజు రక్షణ కొరకు చివరి విన్నపము

9
యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి! మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి!
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options