- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
కీర్తనలు147
Listen to this chapter
0:00
0:00
కరుణగల దేవుని స్తుతించుటకు పిలుపు
1
యెహోవాను స్తుతించండి, మన దేవుని స్తుతించడం ఎంత మంచిది, ఆయనను స్తుతించడం ఎంత మనోహరమైనది, తగినది!
2
యెహోవా యెరూషలేమును కట్టిస్తారు; ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.
3
విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు.
4
ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు, సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.
5
మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు; ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.
6
యెహోవా దీనులను ఆదరిస్తారు కాని దుష్టులను నేలమట్టం చేస్తారు.
ప్రకృతిలో దేవుని పోషణకు స్తుతి
7
యెహోవాకు కృతజ్ఞత స్తుతులు పాడండి; సితారా మీటి దేవునికి స్తుతులు పాడండి.
8
ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు; భూమికి వర్షమిచ్చి కొండలపై గడ్డి మొలిపిస్తారు.
9
ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు.
10
గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. యోధుల కాల్బలంలో ఆనందించరు.
11
ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టి యెహోవా ఆనందిస్తారు.
భద్రత మరియు ధర్మశాస్త్రం కొరకు సీయోను దేవునిని స్తుతించుట
12
యెరూషలేమా, యెహోవాను ఘనపరచు; సీయోనూ, నీ దేవుని స్తుతించు.
13
ఆయన మీ గుమ్మాల గడియలు బలపరుస్తారు మీలో మీ ప్రజలను దీవిస్తారు.
14
ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారు మంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు.
15
ఆయన భూమిని ఆజ్ఞాపిస్తారు; ఆయన శాసనం వేగంగా పరుగెత్తుకొని పోతుంది.
16
ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారు మంచు కణాలను బూడిదలా చెదరగొడతారు.
17
ఆయన వడగండ్లను గులకరాళ్లలా విసిరివేస్తాడు. ఆయన పుట్టించే తీవ్రమైన చలికి ఎవరు తట్టుకోగలరు?
18
ఆయన తన మాటను పంపుతారు, అవన్నీ కరిగిపోతాయి; గాలి వీచేటట్టు చేస్తారు, నీళ్లు పారతాయి.
19
ఆయన యాకోబుకు తన వాక్కును, ఇశ్రాయేలుకు తన న్యాయవిధులను శాసనాలను బయలుపరచారు.
20
ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు; ఆయన న్యాయవిధులు వారికి తెలియవు. యెహోవాను స్తుతించండి.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note