కీర్తనలు143
Listen to this chapter
0:00
0:00
1
దావీదు కీర్తన. యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.
2
మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి, ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు.
3
శత్రువు నన్ను వెంటాడుతున్నాడు, అతడు నా జీవితాన్ని నలిపివేస్తాడు; ఎప్పుడో చచ్చిన వారిలా అతడు నన్ను చీకటిలో నివసించేలా చేస్తాడు.
4
నా ఆత్మ నాలో సొమ్మసిల్లిపోయింది; నా హృదయం నాలో బెదిరిపోయింది.
5
వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.
6
మీ వైవు నా చేతులు చాపుతున్నాను; ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా
7
యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి; ఆత్మ నీరసించి పోతూ ఉంది. మీ ముఖాన్ని మరుగు చేయకండి, లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను.
8
నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.
9
నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను, యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి.
10
మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, మీరు నా దేవుడు; మీ మంచి ఆత్మ సమతల నేల మీద నన్ను నడిపించును గాక.
11
యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి; మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.
12
మీ మారని ప్రేమను బట్టి నా శత్రువులను మౌనం చేయండి; నేను మీ సేవకుని కాబట్టి, నా శత్రువులను నాశనం చేయండి.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note