Skip to content

కీర్తనలు130

1
యాత్రకీర్తన. యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;
2
ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.
3
యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు?
4
కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది, కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము.
5
యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.
6
కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.
7
ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.
8
ఆయనే ఇశ్రాయేలీయులను వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options