కీర్తనలు 123
ఆకాశమందున్న ప్రభువు వైపు కన్నులెత్తుట 1–2
1
యాత్రకీర్తన. పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.
2
దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.
అవమానము మధ్య కరుణ కొరకు ప్రార్థన 3–4
3
మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.
4
మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Study note