Turtle Dove గురించి బైబిల్ వచనాలు: Burnt offering of
Burnt offering of గురించి వచనాలు
“ ‘ఒకవేళ యెహోవాకు అర్పించే అర్పణ పక్షుల దహనబలి అయితే, మీరు పావురం లేదా గువ్వను అర్పించాలి.
యాజకుడు దానిని బలిపీఠం దగ్గరకు తెచ్చి, దాని తలను విరిచి బలిపీఠం మీద దానిని కాల్చాలి; దాని రక్తం బలిపీఠం ప్రక్కనే పిండాలి.
యాజకుడు ఆ పక్షి ప్రేగులను ఈకలను తీసివేసి అదంతా బలిపీఠానికి తూర్పుగా బూడిద ఉండే స్థలంలో పారవేయాలి.
పక్షిని పూర్తిగా విడదీయక, అతడు రెక్కల సందులో దానిని చీల్చాలి, అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద దానిని కాల్చాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.