కంటెంట్‌కు వెళ్లండి

Trespass గురించి బైబిల్ వచనాలు: Of an ox

9 వచనాలు · 4 కోణాలు

Of an ox గురించి వచనాలు

  1. “ఒక ఎద్దు పురుషుని గాని స్త్రీని గాని చనిపోయేంతగా పొడిస్తే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని మాంసం ఎవరూ తినకూడదు. కాని ఆ ఎద్దు యజమాని నిర్దోషి.

  2. అయితే ఎద్దుకు అంతకుముందే స్త్రీని గాని పురుషుని గాని పొడిచే అలవాటు ఉండి, దాని యజమానిని ఈ విషయంలో హెచ్చరించినా అతడు దానిని కట్టి అదుపులో పెట్టకపోవడం చేత ఆ ఎద్దు ఎవరినైనా చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని యజమానికి మరణశిక్ష విధించాలి.

  3. ఒకవేళ నష్టపరిహారం అడిగితే ఆ యజమాని ఆ నష్టపరిహారాన్ని చెల్లించి తన ప్రాణాన్ని విడిపించుకోవచ్చు.

  4. ఆ ఎద్దు కుమారుని గాని కుమార్తెను గాని పొడిచినా ఇదే నియమం వర్తించబడుతుంది.

  5. ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.

  6. “ఒకరు గొయ్యిని తెరచి ఉంచడం వలన లేదా గొయ్యి త్రవ్వి దానిని మూయకపోవడం వలన ఎద్దు గాని గాడిద గాని దానిలో పడిపోతే

  7. ఆ గోతి యజమాని వాటి యజమానికి నష్టపరిహారం చెల్లించాలి; చచ్చిన జంతువు గొయ్యి యజమానిదవుతుంది.

  8. “ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును గాయపరచగా అది చనిపోతే ఆ ఇద్దరు బ్రతికి ఉన్న ఎద్దును అమ్మగా వచ్చిన డబ్బును చచ్చిన ఎద్దును చెరిసగం పంచుకోవాలి.

  9. ఆ ఎద్దుకు అంతకుముందే పొడిచే అలవాటు ఉంటే దాని యజమాని దానిని కట్టి అదుపులో పెట్టలేదు కాబట్టి అతడు ఖచ్చితంగా ఎద్దుకు బదులు ఎద్దు ఇవ్వాలి; చచ్చిన ఎద్దు అతనిది అవుతుంది.