కంటెంట్‌కు వెళ్లండి

Synagogues గురించి బైబిల్ వచనాలు: Revival of, after the captivity

8 వచనాలు · 27 కోణాలు

Revival of, after the captivity గురించి వచనాలు

  1. ప్రజలంతా ఏకమనస్సుతో నీటిగుమ్మం ఎదుట ఉన్న చావడికి వచ్చారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని వారు ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాతో చెప్పారు.

  2. యాజకుడైన ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరు ఉన్న సమాజం ఎదుటకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చాడు.

  3. అతడు నీటిగుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడ ఉన్న విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. వారందరు ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా విన్నారు.

  4. అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు.

  5. ప్రజలందరికి కనిపించేలా వారందరి కన్నా ఎత్తులో ఎజ్రా నిలబడి గ్రంథాన్ని తెరిచాడు. అతడు గ్రంథాన్ని విప్పగానే ప్రజలంతా లేచి నిలబడ్డారు.

  6. ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు.

  7. ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు.

  8. వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి ప్రజలు దానిని గ్రహించేలా దాని అర్థాన్ని వివరించారు.