Shobach గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
హదదెజరు యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించాడు; వారు హేలాముకు వెళ్లారు. హదదెజెరు సేనాధిపతియైన షోబకు వారిని నడిపించాడు.
అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేక పారిపోయారు. దావీదు వారిలో 700 మంది రథసారధులను 40,000 మంది సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోబకును కూడా చంపాడు.
తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు దూతలను పంపి, యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించారు. హదదెజెరు సేనాధిపతియైన షోఫకు వారిని నడిపించాడు.
అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు. దావీదు వారిలో 7,000 మంది రథసారధులను 40,000 సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోఫకును కూడా చంపాడు.