Skip to content

Rizpah గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అయ్యా కుమార్తె రిస్పా సౌలుకు ఉంపుడుగత్తెగా ఉండేది. “నా తండ్రి ఉంపుడుగత్తెతో నీవెందుకు శారీరక సంబంధం పెట్టుకున్నావు?” అని ఇష్-బోషెతు అబ్నేరును అడిగాడు.

  2. అయితే రాజు సౌలుకు అయ్యా కుమార్తె రిస్పాకు పుట్టిన ఇద్దరు కుమారులైన అర్మోని మెఫీబోషెతులను, సౌలు కుమార్తె మెరాబుకు మెహోలతీయుడైన బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలుకు పుట్టిన అయిదుగురు కుమారులను తీసుకువచ్చాడు.

  3. వారిని గిబియోనీయులకు అప్పగించాడు. వారు ఈ ఏడుగురిని యెహోవా ఎదుట కొండమీద ఉరితీసి చంపారు. ఆ ఏడుగురు ఒకేసారి చనిపోయారు. కోతకాలం మొదటి రోజున యవల కోత మొదలు పెడుతున్నప్పుడు వారిని చంపారు.

  4. అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని ఒక బండ మీద దానిని పరచుకొని కోతకాలం ప్రారంభం నుండి ఆ శవాల మీద ఆకాశం నుండి వర్షం కురిసేవరకు పగలు పక్షులు వాటిని ముట్టకుండా రాత్రి అడవి జంతువులు వాటిని తినకుండా కాపలా కాస్తూ ఆమె అక్కడే ఉండిపోయింది.

  5. అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు,