Skip to content

Physiology గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా?

  2. నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి, అది నాకు పూర్తిగా తెలుసు.

  3. రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు, భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు, నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.

  4. నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి; నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.

  5. సమాధానం గల హృదయం శరీరానికి జీవం, అసూయ ఎముకలకు కుళ్ళు.

  6. ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది.

  7. వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది.