Pentecost గురించి బైబిల్ వచనాలు: Institution of
Institution of గురించి వచనాలు
“మీరు మీ పొలంలో విత్తి పండించిన ప్రథమ ఫలాలతో కోత కాల పండుగ చేయాలి. “పొలం నుండి మీ పంటలన్నిటిని కూర్చుకున్న తర్వాత సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ చేయాలి.
“గోధుమపంటలోని ప్రథమ ఫలాలతో వారాల పండుగ ఆచరించాలి, సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ ఆచరించాలి.
“ ‘సబ్బాతు దినం మరుసటి నుండి, మీరు ప్రత్యేక అర్పణ యొక్క పనను తెచ్చిన దినం నుండి, ఏడు వారాలు పూర్తిగా లెక్కించాలి.
ఏడవ సబ్బాతు దినానికి సరిగ్గా యాభై రోజులు లెక్కించాలి, అప్పుడు యెహోవాకు క్రొత్త ధాన్య అర్పణ అర్పించాలి.
మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడినుండి, రెండు ఓమెర్ల నాణ్యమైన పిండితో రెండు రొట్టెలను పులిసిన దానితో కాల్చి, యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాల ప్రత్యేక అర్పణగా తీసుకురండి.
ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
పాపపరిహారబలి కోసం మేకపోతును, సమాధానబలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లను అర్పించాలి.
యాజకుడు రెండు గొర్రెపిల్లలను ప్రథమ ఫలాల రొట్టెలతో పాటు యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అవి యాజకుని కోసం యెహోవాకు అర్పించే పరిశుద్ధ అర్పణలు.
అదే రోజు పరిశుద్ధ సభను ప్రకటించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. మీరెక్కడున్నా ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
“ ‘ప్రథమ ఫలాల రోజున, వారాల పండుగలో యెహోవాకు క్రొత్త ధాన్యంతో భోజనార్పణ అర్పించినప్పుడు పరిశుద్ధ సభ ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా అర్పించాలి.
ప్రతి కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;
ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి.
దానితో పాటు ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును అర్పించాలి.
దహనబలులు, ఆహార అర్పణలతో పాటు, వీటిని వీటి పానార్పణాలతో కలిపి అర్పించాలి. అర్పణ కోసం తెచ్చే ప్రతి జంతువు లోపం లేనిదై ఉండాలి.
పంటపై కొడవలి వేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్కించాలి.
మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి స్వేచ్ఛార్పణలు ఇవ్వడం ద్వారా మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగ ఆచరించాలి.
మీరు, మీ కుమారులు, కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఆనందించాలి.
మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ శాసనాలను జాగ్రత్తగా పాటించండి.
సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో కనబడాలి: పులియని రొట్టెల పండుగలో, వారాల పండుగలో, గుడారాల పండుగలో. యెహోవా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.