Miter గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
వారు తయారుచేయవలసిన వస్త్రాలు ఇవే: రొమ్ము పతకం, ఏఫోదు, నిలువుటంగీ, అల్లిన చొక్కా, తలపాగా, నడికట్టు. నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ పవిత్ర వస్త్రాలను తయారుచేయాలి.
“స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కాలి: పరిశుద్ధత యెహోవాకే.
దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టాలి. అది తలపాగా ముందు భాగంలో ఉండాలి.
అది అహరోను నుదిటిపై ఉంటుంది, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించే పవిత్ర బహుమతులలో, ఆ బహుమతులు ఏవైనా సరే, వాటిలో ఉన్న అపరాధాన్ని అతడు భరిస్తాడు, అది అహరోను నుదుటిపై నిరంతరం ఉంటుంది, తద్వారా వారు యెహోవాకు అంగీకారంగా ఉంటారు.
“సన్నని నారబట్టతో చొక్కా నేయాలి. సన్నని నారబట్టతో తలపాగా తయారుచేయాలి. బుటా పనిగా నడికట్టు చేయాలి.
సన్నని నారతో తలపాగా, నార టోపీలు, పేనిన సన్నని నారతో లోదుస్తులు చేశారు.
పేనిన సన్నని నారతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో బుటా పనిగా నడికట్టు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
వారు పవిత్ర చిహ్నంగా స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి, దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కారు: పరిశుద్ధత యెహోవాకే.
దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు.