Skip to content

Mark గురించి బైబిల్ వచనాలు

6 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కొంతకాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగివెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకుందాం” అని బర్నబాతో అన్నాడు.

  2. బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు.

  3. కాని పౌలు, పంఫులియాలో అతడు పరిచర్యకు రాకుండా తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు కాబట్టి అతన్ని తీసుకుని వెళ్లడం మంచిది కాదని తలంచాడు.

  4. ఆ విషయాన్ని బట్టి వారిద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారిద్దరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర ద్వీపానికి వెళ్లాడు.

  5. నా తోటి ఖైదీలైన అరిస్తర్కుకు బర్నబాకు దగ్గరి బంధువైన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. మార్కును గురించి మీరు ఇంతకుముందే సూచనలు అందుకున్నారు, కాబట్టి అతడు మీ దగ్గరకు వస్తే, అతన్ని చేర్చుకోండి.

  6. యూస్తు అనబడే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యం కోసం నాతో ఉన్న జతపనివారి మధ్యలో, యూదులు వీరు మాత్రమే ఉన్నారు. వీరు నాకు ఆదరణ కలిగిస్తున్నారు.