కంటెంట్‌కు వెళ్లండి

Jonathan గురించి బైబిల్ వచనాలు: 1. A Levite of Bethlehem, who becomes a priest for Micah; accepts idolatry; joins the Danites

7 వచనాలు · 11 కోణాలు

1. A Levite of Bethlehem, who becomes a priest for Micah; accepts idolatry; joins the Danites గురించి వచనాలు

  1. యూదా ప్రాంతంలోని బేత్లెహేములో యూదా కుటుంబీకులతో నివసిస్తున్న ఒక లేవీ యువకుడు,

  2. యూదాలోని బేత్లెహేము పట్టణాన్ని విడిచి, తాను నివసించడానికి స్థలం వెదకడానికి వెళ్లాడు. ఆ పనిమీద వెళ్తూ అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని మీకా ఇంటికి వచ్చాడు.

  3. మీకా అతన్ని, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అతడు, “నేను యూదాలోని బేత్లెహేములో ఉంటున్న లేవీయుడను. నివసించడానికి స్థలం వెదకుతున్నాను” అన్నాడు.

  4. అప్పుడు మీకా ఆ లేవీయునితో, “నీవు నాతో నివసిస్తూ, నా తండ్రిగా, యాజకునిగా ఉండిపో. నేను సంవత్సరానికి పది షెకెళ్ళ వెండి, బట్టలు, భోజనం ఇస్తాను” అన్నాడు.

  5. కాబట్టి ఆ లేవీయుడు అతనితో ఉండడానికి ఒప్పుకున్నాడు, ఆ యువకుడు తన కుమారులలో ఒకనిగా అయ్యాడు.

  6. మీకా ఆ లేవీయున్ని నియమించగా ఆ యువకుడు యాజకునిగా ఉంటూ ఆ ఇంట్లో నివసించాడు.

  7. మీకా, “ఈ లేవీయుడు నా యాజకుడయ్యాడు, కాబట్టి ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తారని నాకు తెలుసు” అన్నాడు.