Skip to content

Inconsistency గురించి బైబిల్ వచనాలు

8 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు?

  2. ఎప్పుడూ నీ కంటిలో దూలాన్ని ఉంచుకుని నీ సహోదరునితో, ‘నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు?’ అని నీవెలా అనగలవు?

  3. ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.

  4. కాబట్టి వారు మీతో చెప్పేవాటన్నిటిని జాగ్రత్తగా అనుసరించండి. కాని వారు చేసే క్రియలను చేయకండి, ఎందుకంటే వారు బోధించే వాటిని పాటించరు.

  5. వారు మోయలేనంత బరువులను కట్టి, మనుష్యుల భుజాల మీద పెడతారు, కాని తమ ఒక చేతి వ్రేలితో కూడా వాటిని కదిలించడానికి ఇష్టపడరు.

  6. అలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరు, మీకు మీరు బోధించుకోరా? దొంగతనం చేయవద్దని ప్రకటిస్తున్న మీరే దొంగతనం చేస్తారా?

  7. వ్యభిచరించవద్దు అని ప్రజలకు చెప్పే మీరే వ్యభిచరిస్తారా? విగ్రహాలను అసహ్యించుకునే మీరే గుళ్లను దోచుకుంటారా?

  8. ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవున్ని అవమానిస్తారా?