కంటెంట్‌కు వెళ్లండి

Houses గురించి బైబిల్ వచనాలు

33 వచనాలు · 66 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకవేళ సంవత్సరం పూర్తిగా గడిచే లోపు దానిని విడిపించకపోతే, ప్రాకారం కలిగిన పట్టణంలోని ఇల్లు శాశ్వతంగా కొనుగోలుదారునికి, అతని వారసులకు చెందుతుంది. ఇది యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడదు.

  2. కానీ వారి చుట్టూ ఉన్న ప్రాకారాలు లేని గ్రామాల్లోని ఇల్లు బహిరంగ దేశానికి చెందినవిగా పరిగణించాలి. అవి విడిపించబడవచ్చు, అవి యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడాలి.

  3. “ ‘లేవీయులకు శాశ్వతంగా తమ దగ్గర ఉన్న లేవీయ పట్టణాల్లో తమ ఇళ్ళను విడిపించుకునే హక్కు ఉంటుంది.

  4. కాబట్టి లేవీయుల ఆస్తి విడిపించదగినది అంటే, వారి ఇల్లు ఏ పట్టణంలో అమ్మబడినా యాభైయవ వార్షికోత్సవంలో, తిరిగి ఇవ్వబడాలి, ఎందుకంటే లేవీయుల పట్టణాలలోని ఇల్లు ఇశ్రాయేలీయుల మధ్యలో వారి ఆస్తి.

  5. అతడు తన రాజభవనంలో మేడ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతన్ని సమీపించి, “నా దగ్గర దేవుని నుండి మీకొక సందేశం ఉంది” అని అన్నాడు. రాజు తన సింహాసనం మీద నుండి లేస్తున్నప్పుడు,

  6. ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ ఖడ్గాన్ని తీసి రాజు పొట్టలో పొడిచాడు.

  7. ఖడ్గం పిడి కూడ పొట్టలోనికి వెళ్లింది. ఏహూదు ఖడ్గాన్ని బయటకు లాగలేదు, ఖడ్గం పైనుండి క్రొవ్వు చుట్టుకుంది.

  8. అప్పుడు ఏహూదు వాకిలి వైపు వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపులు వేసి వాటికి తాళం వేశాడు.