First Fruits గురించి బైబిల్ వచనాలు: First ripe of fruits, grain, oil, wine, and first of fleece, required as an offering
First ripe of fruits, grain, oil, wine, and first of fleece, required as an offering గురించి వచనాలు
వాటిని ప్రథమ ఫలంగా యెహోవాకు అర్పించవచ్చు కాని, బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగల దానిగా వాటిని అర్పించకూడదు.
మీ భోజనార్పణలను అన్నిటికి ఉప్పు కలపండి. మీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా మీ భోజనార్పణలు ఉండకూడదు; మీ అర్పణలన్నిటికీ ఉప్పు కలపండి.
“ ‘మీరు ప్రథమ ఫలాల భోజనార్పణ యెహోవా దగ్గరకు తీసుకువస్తే, క్రొత్త ధాన్యాన్ని దంచి అగ్నిలో వేయించి అర్పించాలి.
దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ.
యాజకుడు జ్ఞాపకార్థ భాగమైన నలుగగొట్టిన ధాన్యాన్ని, నూనెను, ధూపంతో కలిపి యెహోవాకు హోమబలిగా దహించాలి.