Fat గురించి బైబిల్ వచనాలు: Offered in sacrifice
Offered in sacrifice గురించి వచనాలు
సమాధానబలి అర్పణ నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: లోపలి అవయవాలు, వాటికి ఉన్న సమస్త క్రొవ్వు,
రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మీరు మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పుపై పేర్చిన కట్టెల మీద ఉన్న దహనబలితో పాటు వీటిని దహించాలి; అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
సమాధానబలి నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: ఆ బలి పశువు క్రొవ్వునూ, వెన్నెముక చివర వరకు ఉండే క్రొవ్వు పట్టిన తోకంతటిని, దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న క్రొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే క్రొవ్వునూ పూర్తిగా తీసుకురావాలి,
రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
యాజకుడు వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమబలిగా దహించాలి.
మీరు అర్పించే దాని నుండి హోమబలి యెహోవా ఎదుట సమర్పించాలి: లోపలి అవయవాలు వాటి మీద ఉన్న కొవ్వంతా.
రెండు మూత్రపిండాలు నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
యాజకుడు వాటిని హోమబలిగా యెహోవాకు ఇష్టమైన సువాసనగల అర్పణగా బలిపీఠం మీద కాల్చివేయాలి. కొవ్వంతా యెహోవాదే.
పాపపరిహారబలి కోసం తెచ్చిన కోడె యొక్క క్రొవ్వంతా అంటే లోపలి అవయవాలకు ఉన్న క్రొవ్వు,
రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు
సమాధానబలిగా అర్పించబడే ఎద్దు క్రొవ్వును తీసేసినట్లే తీయాలి. అప్పుడు యాజకుడు వాటిని దహనబలి యొక్క బలిపీఠం మీద కాల్చాలి.
దాని కొవ్వంతా అనగా క్రొవ్విన తోక, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వు,
రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
యెహోవాకు అర్పించిన హోమబలిగా యాజకుడు వాటిని బలిపీఠం మీద కాల్చివేయాలి. ఇది అపరాధపరిహారబలి.
తర్వాత దాని క్రొవ్వును, తోకకు ఉన్న క్రొవ్వును, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వును, రెండు మూత్రపిండాలను వాటి క్రొవ్వును, వాటి కుడి తొడను తీసుకున్నాడు.
యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక మందమైన రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, ఒక పల్చని రొట్టెను తీసుకుని, ఆ క్రొవ్వు మీద, కుడి తొడ మీద ఉంచాడు.
అయితే క్రొవ్వును దహించకముందే యాజకుని సేవకుడు వచ్చి బలి అర్పించిన వారితో, “యాజకునికి కాల్చడానికి కొంత మాంసం ఇవ్వు; ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు పచ్చి మాంసమే కావాలి” అని చెప్పేవాడు.
అయితే వారు అతనితో, “మొదట క్రొవ్వును దహించనివ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు” అని చెప్తే ఆ సేవకుడు, “అలా కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి; నీవు ఇవ్వకపోతే నేనే బలవంతంగా తీసుకుంటాను” అని అనేవాడు.