Skip to content

False Accusation గురించి బైబిల్ వచనాలు: General references

12 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

  1. “పుకార్లు ప్రచారం చేయకూడదు. అన్యాయపు సాక్షిగా ఉండి దుర్మార్గులకు సహాయం చేయకూడదు.

  2. తప్పుడు ఆరోపణలకు దూరంగా ఉండాలి, అమాయక లేదా నిజాయితీగల వ్యక్తిని చంపవద్దు, ఎందుకంటే నేను దోషులను నిర్దోషిగా ప్రకటించను.

  3. “ ‘మీ ప్రజల్లో కొండేలు వ్యాపింపచేస్తూ తిరగకూడదు. “ ‘మీ పొరుగువారి ప్రాణానికి అపాయం కలిగించేది ఏది చేయకూడదు. నేను యెహోవాను.

  4. నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.

  5. నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.

  6. నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; నాకు కీడును తలపెడుతున్నారు.

  7. “దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.

  8. నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.

  9. “నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు.

  10. తర్వాత కొందరు సైనికులు వచ్చి, “మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకతడు, “ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి” అని వారితో చెప్పాడు.

  11. ప్రేమలేనివారిగా, క్షమించలేనివారిగా, అపనిందలు వేసేవారిగా, స్వీయ నియంత్రణ లేనివారిగా, క్రూరులుగా, మంచితనాన్ని ప్రేమించలేనివారిగా,

  12. క్రీస్తు నామం కోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావము.