Enemy గురించి బైబిల్ వచనాలు: The wickedness of David's enemy
The wickedness of David's enemy గురించి వచనాలు
ఎందుకంటే దుష్టులు మోసగాళ్ళు నాకు వ్యతిరేకంగా తమ నోళ్ళు తెరిచి; అబద్ధాలాడే నాలుకలతో వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ద్వేషపూరిత మాటలతో వారు నన్ను చుట్టుముడతారు; వారు కారణం లేకుండా నా మీద దాడి చేస్తారు.
వారు నా ప్రేమకు ప్రతిగా నా మీద ఆరోపణలు చేస్తారు, కాని నేనైతే ప్రార్థిస్తూ ఉంటాను.
నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు. నా ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపుతారు.
యాత్రకీర్తన. “నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు” అని ఇశ్రాయేలు అనాలి;
“నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.
దున్నువారు దున్నినట్లు నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.