Earth గురించి బైబిల్ వచనాలు: Primitive condition of
Primitive condition of గురించి వచనాలు
దేవుడు, “ఆకాశ జలాలను భూ జలాలను వేరు చేయడానికి జలాల మధ్య విశాలం కలుగును గాక” అన్నారు.
అలాగే జరిగింది. దేవుడు విశాలాన్ని చేసి ఆ విశాలం క్రింది జలాలను విశాలం మీది జలాలను వేరుచేశారు.
భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు.
మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు; జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి.
మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;
అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.
అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు; అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు.