- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Damages and Compensation గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“ఒకవేళ ప్రజలు జగడమాడుతూ ఒక వ్యక్తి ఇంకొకరిని రాయితో గాని పిడికిలితో గాని కొడితే బాధితుడు చావకపోవచ్చు కాని మంచానికి పరిమితమై,
తర్వాత అతడు లేచి చేతికర్ర సహాయంతో బయట తిరుగుతూ ఉంటే కొట్టినవానికి శిక్ష విధించబడదు; కాని ఆ కొట్టినవాడు గాయపడిన వ్యక్తికి ఆ సమయంలో కలిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించి ఆ బాధితుడు పూర్తిగా బాగుపడేలా చూడాలి.
“ఒక ఎద్దు పురుషుని గాని స్త్రీని గాని చనిపోయేంతగా పొడిస్తే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని మాంసం ఎవరూ తినకూడదు. కాని ఆ ఎద్దు యజమాని నిర్దోషి.
అయితే ఎద్దుకు అంతకుముందే స్త్రీని గాని పురుషుని గాని పొడిచే అలవాటు ఉండి, దాని యజమానిని ఈ విషయంలో హెచ్చరించినా అతడు దానిని కట్టి అదుపులో పెట్టకపోవడం చేత ఆ ఎద్దు ఎవరినైనా చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని యజమానికి మరణశిక్ష విధించాలి.
ఒకవేళ నష్టపరిహారం అడిగితే ఆ యజమాని ఆ నష్టపరిహారాన్ని చెల్లించి తన ప్రాణాన్ని విడిపించుకోవచ్చు.
ఆ ఎద్దు కుమారుని గాని కుమార్తెను గాని పొడిచినా ఇదే నియమం వర్తించబడుతుంది.
ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.
“ఒకరు గొయ్యిని తెరచి ఉంచడం వలన లేదా గొయ్యి త్రవ్వి దానిని మూయకపోవడం వలన ఎద్దు గాని గాడిద గాని దానిలో పడిపోతే
ఆ గోతి యజమాని వాటి యజమానికి నష్టపరిహారం చెల్లించాలి; చచ్చిన జంతువు గొయ్యి యజమానిదవుతుంది.
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
“ఒకవేళ మనుష్యులెవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన దాని విషయంలో ఆ వ్యక్తిని మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక ఒత్తిడిచేసినా, లేక పొరుగువాడు పోగొట్టుకున్న వస్తువు దొరికినా సరే దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి వాటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకు వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపమే అవుతుంది.
Or have found that which was lost, and lieth concerning it, and sweareth falsely; in any of all these that a man doeth, sinning therein:
వారు వీటిలోని దేని విషయంలోనైనా పాపం చేసి తమ అపరాధాన్ని గ్రహిస్తే, వారు దొంగిలించిన లేదా దోపిడి ద్వారా తీసుకున్నా, లేదా వారికి అప్పగించబడినదైనా, లేదా పోయిన ఆస్తి తిరిగి దొరికినదైనా,
లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి.
ఒకవేళ ఒక వ్యక్తి భార్యను తీసుకుని, ఆమెతో పడుకున్న తర్వాత, ఆమెను ఇష్టపడక,
ఆమెను దూషించి, ఆమె పేరు చెడ్డ చేసి, “నేను ఈ స్త్రీని పెళ్ళి చేసుకున్నాను, కానీ నేను ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, ఆమె కన్యత్వానికి రుజువు దొరకలేదు” అని చెప్తే,
అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు ఆమె కన్య అనే రుజువును పట్టణ పెద్దల దగ్గరకు తీసుకురావాలి.
ఆమె తండ్రి పెద్దలతో, “నేను నా కుమార్తెను ఈ వ్యక్తికిచ్చి పెళ్ళి చేశాను, కాని అతనికి ఆమెపై ఇష్టం లేదు.
ఇప్పుడు అతడు ఆమెను దూషించి, ‘మీ కుమార్తె కన్యగా నాకు కనిపించలేదు’ అని అంటున్నాడు. కానీ, నా కుమార్తె కన్యత్వానికి ఇది రుజువు” అని ఆమె తల్లిదండ్రులు పట్టణ పెద్దల ముందు వస్త్రాన్ని ప్రదర్శించాలి,
పట్టణ పెద్దలు ఆ వ్యక్తిని తీసుకెళ్లి అతన్ని శిక్షించాలి.
వారు అతనికి వంద షెకెళ్ళ వెండి జరిమానా విధించి, ఆ యువతి తండ్రికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలు కన్యకు చెడ్డ పేరు పెట్టాడు. ఆమె అతని భార్యగా ఉంటుంది; అతడు బ్రతికున్నంత కాలం అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
ఒకవేళ ఒక పురుషుడు పెళ్ళి నిశ్చయం కాని ఒక కన్యను కలవడం జరిగి ఆమెను బలత్కారం చేసి వారు పట్టుబడితే,
అతడు ఆమె తండ్రికి యాభై షెకెళ్ళ వెండి చెల్లించాలి. అతడు ఆ యువతిని అవమానించాడు కాబట్టి ఆమెను పెళ్ళి చేసుకోవాలి. అతడు బ్రతికున్నంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.