Armor గురించి బైబిల్ వచనాలు: The equipment of a soldier
The equipment of a soldier గురించి వచనాలు
“చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి.
గుర్రాలను సిద్ధం చేసుకోండి, గుర్రాలను ఎక్కండి! శిరస్త్రాణం ధరించి బయలుదేరడానికి సిద్ధపడండి! నీ ఈటెలను పదును చేయండి, మీ కవచాన్ని ధరించండి!
స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని,
పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి.
వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు.
రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.