Jabin
Jabin ను ప్రస్తావించే వచనాలు
కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా.
యాబీను సేనాధిపతియైన సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నడిపించి నీ చేతికి అతన్ని అప్పగిస్తాను.’ ”
హాసోరు రాజైన యాబీనుకు, కెనీయుడైన హెబెరు కుటుంబానికి మధ్య స్నేహబంధం ఉండేది కాబట్టి సీసెరా కాలినడకన కెనీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారానికి పారిపోయాడు.
ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును ఓడించారు.
ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును సంపూర్ణంగా నాశనం చేసే వరకు వారి హస్తం అంతకంతకు కఠినం అయ్యింది.
మిద్యానుకు చేసినట్లుగా, కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.