Skip to content
పరమగీతము 5:2-8

పరమగీతము 5:2-8

2
నేను నిద్ర పోతున్నానన్న మాటే గాని, నా హృదయం మేలుకొని ఉంది. వినండి! నా ప్రియుడు తలుపు తడుతూ: “తలుపు తియ్యి, నా సోదరీ, నా ప్రియురాలా! నా పావురమా, నిష్కళంకురాలా. నా తల మంచుకు తడిసింది, రాత్రి తేమకు నా వెంట్రుకలన్నీ తడిసిపోయాయి.”
3
నేను నా వస్త్రాన్ని తీసివేశాను దాన్ని మళ్ళీ ధరించాలా? నేను నా కాళ్లు కడుక్కున్నాను మళ్ళీ వాటిని మురికి చేసుకోవాలా?
4
నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే; నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది.
5
నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను. నా చేతులు బోళముతో తడిసి, నా వ్రేళ్ళ నుండి బోళం, తలుపు గడియ మీదికి స్రవించింది.
6
నా ప్రియుడికి, నేను తలుపు తీసేలోగా, ఆయన వెళ్లిపోయాడు. నా ప్రాణం స్పృహ తప్పింది. నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనబడలేదు. నేను ఆయనను పిలిచాను కాని ఆయన పలుకలేదు.
7
పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు; నా ముసుగును తొలగించారు, వారు ప్రాకారం మీద కావలివారు.
8
యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, ఆయనకు మీరు ఏమి చెప్తారు? ప్రేమను బట్టి నాకు స్పృహ తప్పిందని చెప్తామని ప్రమాణం చేయండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options